నారాయణఖేడ్ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం
నారాయణఖేడ్, సెప్టెంబర్ 6 (స్పందన) నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యతను కాపాడే లక్ష్యంతో జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఈ సమావేశానికి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్ అధ్యక్షతన కొనసాగింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు సమావేశమై నూతన ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు వృత్తిలో క్రమశిక్షణ చాలా అవసరమని, ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వార్తలు రాయాలని సూచించారు.నారాయణఖేడ్ నియోజకవర్గ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక కాగా నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యతను కాపాడే లక్ష్యంతో జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు సమావేశమై నూతన కార్యవర్గానికి ఎంపిక చేయడం జరిగింది. నూతన కమిటీ సభ్యులు జర్నలిస్టుల సమస్యలపై పోరాడి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు.ఈ నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా ఎం.ఎ. అలీమ్, అధ్యక్షులు గా జి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె. భూమయ్య బాధ్యతలు స్వీకరించారు.ఉపాధ్యక్షులుగా సంగారెడ్డి (నారాయణఖేడ్), బి. సంగప్ప (మన్నూర్), నుకాల రాజేశ్వర్ (కంగ్టి), రమేష్ గౌడ్ (.కల్హేర్ ), రామిరెడ్డి .జి. విట్టల్ రామ్ రెడ్డి (కంగ్టి)ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎం.ఎ. నాతిక్ బాధ్యతలు చేపట్టారు.అలాగే సహాయ కార్యదర్శులుగా లింగాపురం అంజయ్య, రషీద్, జైపాల్ రెడ్డి, ఎండీ ఫహీమ్; సంస్థ కార్యదర్శులుగా కె.సంతోష్ చారి , వీరారెడ్డి ఎంపిక కాగా; కార్యవర్గ సభ్యులుగా ఎం.ఎ. సత్తార్, శరణప్ప, శంకర్ లు ఎన్నికయ్యారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా బి. రాములు ప్రధాన కార్యదర్శిగా M A జావిద్. ఉపాధ్యక్షులుగా M. అశోక్ కుమార్. నిసార్. కోశాధికారి గా రవీందర్. జాయింట్ సెక్రటరీ గా అంబదాస్. మాణిక్. ఎన్నికయ్యారు..సమావేశంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని స్థానిక సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రతినిధి బాసిత్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు సిద్ధన్న పాటిల్,జిల్లా ప్రధాన కార్యదర్శి రు మాండ్ల అనిల్, ఉపాధ్యక్షులుశ్రీనాథ్ మతీన్,ఆర్ సత్యనారాయణ రెడ్డి, మల్లేశం,జాయింట్ సెక్రటరీలు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీనివాసరెడ్డి,ఎంఏ రవూఫ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు విలాస్ విల్సన్ ,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, కోశాధికారి శ్రీధర్ జైన్, చిన్న , మధ్య తరహా పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి చవాన్ ఈశ్వర్, కోశాధికారిగా లక్ష్మణ్ , ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్,సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీనాజ్ తదితరులు పాల్గొన్నారు.