అన్నదానం మహాదానం.. సేవా కార్యక్రమాలతో యువతకు ఆదర్శం
వట్పల్లి, సెప్టెంబర్ 23 (స్పందన) వట్పల్లి మండలం మరవెల్లి గ్రామంలోని బసవేశ్వర విగ్రహం వద్ద శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా కలాలి లక్ష్మి–మల్లేశం గౌడ్ వ్యవహరించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.“అన్నం పెట్టే చేతులు.. ఆశీర్వాదాలు అందుకునే చేతులుగా మారుతాయి” అనే సందేశానికి అనుగుణంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించి నిర్వాహకులను ఆశీర్వదించారు. భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువత సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ పెద్దగోళ్ల సాయిబాబా, మన్నే ఆంజనేయులు, పాండు, వెంకట్, బసవరాజ్, పల్వట్ల అభి, పల్వట్ల రాజు,బీరప్ప, రాజులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉత్సవాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా భక్తి, సేవ, ఐక్యతను పెంపొందించేలా ఉండాలని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.