🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 24 Sep, 2026 | Page: 1

కంగ్టి మండలంలో భారీ చోరీ

కంగ్టి మండలంలోని చాప్టా కే గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సేరి నాగొండ, తండ్రి హన్మగొండ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రెండు తులాల బంగారం, 50 తులాల వెండి కడియాలు, రూ.25 వేల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై దుర్గారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్ నిపుణులతో ఆధారాలు సేకరించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home