కన్‌సాన్‌పల్లిలో రికార్డు స్థాయిలో లడ్డు వేలం.. రూ.46,800
10 కిలోల వినాయక లడ్డును దక్కించుకున్న బీఆర్ఎస్ యువ నాయకుడు ధీరజ్‌రెడ్డి
గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన లడ్డు.. పోటాపోటీగా సాగిన వేలం
అందోలు, సెప్టెంబర్ 24 (స్పందన) భక్తితో సమర్పించిన గణపయ్య లడ్డు.. వేలంలో పలికిన ధర కంటే భక్తుల విశ్వాసమే గొప్పది” అనేలా కన్సాన్పల్లి గ్రామంలో వినాయక లడ్డు వేలం ఉత్సాహభరితంగా సాగింది. అందోలు మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలోని దుర్గా భవాని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాట రికార్డు స్థాయిలో ధర పలికింది.గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు నోమన్నగారి ధీరజ్‌రెడ్డి వేలం పాటలో పాల్గొని రూ.46,800కు 10 కిలోల వినాయక లడ్డును సొంతం చేసుకున్నారు. వేలం ప్రారంభమైనప్పటి నుంచి పలువురు పోటీపడటంతో ఉత్కంఠ నెలకొంది. చివరి వరకు ఇద్దరి మధ్య పోటాపోటీగా సాగిన వేలంలో ధీరజ్‌రెడ్డి లడ్డును దక్కించుకున్నారు.గ్రామ చరిత్రలోనే వినాయక లడ్డు అత్యధిక ధరకు వేలం కావడంతో ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. లడ్డు దక్కించుకున్న ధీరజ్‌రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి లడ్డును అందజేశారు.
వైభవంగా వినాయక నిమజ్జనం
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర గ్రామంలో కన్నులపండువగా సాగింది.మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతానికి చెందిన మహిళా డ్యాన్సర్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫోక్ సాంగ్స్‌తో పాటు భక్తి గీతాలకు మహిళా డ్యాన్సర్లు చేసిన నృత్యాలు గ్రామస్తులను అలరించాయి. తొలిసారిగా మహిళా డ్యాన్సర్లు వినాయక శోభాయాత్రలో పాల్గొనడంతో వారిని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.యువకులు, చిన్నారులు గణేష్ శోభాయాత్రలో కేరింతలు కొడుతూ సందడి చేశారు. భక్తుల జయజయధ్వానాలు, డప్పుల మోతలు, నృత్యాలతో కన్సాన్పల్లి గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.