🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 25 Sep, 2026 | Page: 1

లింగాయత్ సమాజం వినాయకుడి లడ్డుకు భారీ డిమాండ్

వట్ పల్లి,సెప్టెంబర్ 25(స్పందన) వట్పల్లి మండల పరిధిలోని వీరశైవ లింగాయత్ సమాజం తరుపున హనుమాన్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడు పదకొండు రోజులు భక్తి శ్రద్దలతో పూజలు చేసిన భక్తులు అనంతరం శుక్రవారం సాయంత్రం నిమజ్జనం తాలెల్మ శివారులోని చెక్ డ్యామ్ లో నిమజ్జనం చేశారు. కాగా అంతకుముందు జరిగిన వేలం పాటలో లడ్డూను ప్రాథమిక సహకార సంఘం మాజీ సభ్యుడు గాండ్ల శరణ్ కుమార్ ఎనబై వేలకు మొదటి లడ్డు దక్కించుకోగా రెండోది తిగుళ్ల రాజశేఖర్ యాబై వేలకు దక్కించుకున్నారు ఇక మూడో లడ్డూ వేలంపాటలో దక్కించుకున్నారు.వేలం అనంతరం శరణ్,రాజశేఖర్, విజయ్ మాట్లాడుతూ దైవ ప్రసాదం తమకు దక్కడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మలి మధు,మెడుకుందె కిరణ్,గాండ్ల విరేందర్,మెతుకు శేఖర్,మంతూరి గోపాల్,పరమేశ్వర్, మన్నే వీరేశం,జంగం మల్లికార్జున్, మహేష్,అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home