🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 28 Sep, 2026 | Page: 1

అధునాతన రోబోటిక్ టెక్నాలజీ తో శస్త్రచికిత్సలు

-యశోద హాస్పిటల్స్‌ థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రోహన్‌ రెడ్డి
సంగారెడ్డి,సెప్టెంబర్ :28(స్పందన )ఛాతీకి సంబంధించిన వివిధ వ్యాధులకు యశోద హాస్పిటల్స్‌ అధునాతన వైద్య సేవలను అందిస్తోంది అని యశోద హాస్పిటల్స్‌ థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రోహన్‌ రెడ్డి తెలిపారు . సోమవారం నాడు రెడ్లాస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వేసివ్‌ థొరాసిక్‌ సర్జరీ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, ఛాతీలోని కణితులు తదితర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ఆయన తెలిపారు.
వీడియో అసిస్టెడ్‌ థొరాసిక్‌ సర్జరీ, రోబోటిక్‌ అసిస్టెడ్‌ థొరాసిక్‌ సర్జరీ వంటి ఆధునిక పద్ధతులతో చిన్న కోతల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానాల వల్ల రోగులకు నొప్పి, రక్తస్రావం తక్కువగా ఉండటంతో పాటు ఆసుపత్రిలో ఉండే సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. రోగులు త్వరగా కోలుకుని సాధారణ కార్యకలాపాలకు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. గత పదేళ్లలో థొరాసిక్‌ సర్జరీ రంగంలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత, ముందస్తు వ్యాధి నిర్ధారణ, వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సంక్లిష్టమైన ఛాతీ సంబంధిత వ్యాధులకు కూడా సమర్థవంతమైన చికిత్స అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.అధునాతన ఆపరేషన్‌ థియేటర్లు, హైడెఫినిషన్‌ ఇమేజింగ్‌ సిస్టమ్స్‌, ఆధునిక సర్జికల్‌ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థొరాసిక్‌ సర్జన్లు, పల్మనాలజిస్టులు, ఆంకాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్‌ కేర్‌ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రారంభ దశలో గుర్తించిన ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అన్నవాహిక వ్యాధుల నుంచి ఛాతీలోని కణితులు, సంక్లిష్టమైన థొరాసిక్‌ అత్యవసర పరిస్థితుల వరకు సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైతే అందుకు సంబంధించిన అధునాతన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
🏠 Home