🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 29 Sep, 2026 | Page: 1

వట్పల్లి దాడి కేసులో ఆరుగురికి జైలు శిక్ష, జరిమానా

వట్పల్లి, సెప్టెంబర్ 28 (స్పందన)

వట్పల్లి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళను దూషించి, ఆమె భర్తపై కట్టెలతో దాడి చేసి గాయపరిచిన కేసులో ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

కేసు వివరాలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెప్టెంబర్ 15న ఉదయం 9 గంటల సమయంలో వట్పల్లి గ్రామానికి చెందిన పల్లె సుమిత్రాబాయి తన భర్త కిషన్‌రావు కోసం టిఫిన్ బాక్స్ తీసుకొని వట్పల్లి చౌరస్తాలోని కిరాణా దుకాణం వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాపోళ్ల లక్ష్మి, బాపోళ్ల అనిత పాత కక్షలను మనసులో పెట్టుకొని ఆమెను దూషించారు. ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించగా చంపుతామని బెదిరించారు.

దీంతో భయపడిన సుమిత్రాబాయి అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ కిరాణా దుకాణంలోకి వెళ్లి తన భర్త కిషన్‌రావుకు జరిగిన విషయాన్ని తెలియజేస్తుండగా.. బాపోళ్ల పండురావు, బాపోళ్ల రాజారావు, బాపోళ్ల వెంకట్‌రావు, నిట్లూరు విట్టల్ కట్టెలతో అక్కడికి వచ్చి కిషన్‌రావుపై దాడి చేసి గాయపరిచారు. చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని వారిని విడిపించారు.

ఆరుగురిపై కేసు నమోదు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి వట్పల్లి ఎస్‌ఐ కె. గణేష్ కేసు నమోదు చేశారు. నేరం నంబర్ 19/2017గా ఐపీసీ 452, 324, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 2017 సెప్టెంబర్ 17న ఆరుగురు నిందితులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి 2017 అక్టోబర్ 30న న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.

నిందితులకు శిక్షలు ఇవే..

కేసు విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అందోలు–జోగిపేట న్యాయస్థానం న్యాయమూర్తి ఎం. మహమ్మద్ అసదుల్లా షరీఫ్ అసద్ ఆరుగురు నిందితులకు శిక్షలు విధిస్తూ 2026 సెప్టెంబర్ 28న తీర్పు ఇచ్చారు.
A1 బాపోళ్ల లక్ష్మి, A2 బాపోళ్ల అనిత: ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా
A3 బాపోళ్ల పండురావు, A4 బాపోళ్ల రాజారావు, A5 బాపోళ్ల వెంకట్‌రావు, A6 నిట్లూరు విట్టల్: ఒక్కొక్కరికి రూ.4,000 జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. తో పాటు ఆరు నెలల జైలు శిక్ష.ఈ కేసులో కోర్టు ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ టి. లతీఫ్ ఉర్ రెహమాన్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు అధికారి కె. గణేష్, ప్రస్తుతం వట్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న పి. లక్ష్మీకాంత్ రెడ్డి, కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది బి. భాస్కర్ తదితరులు కేసు ప్రక్రియలో భాగస్వాములయ్యారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు పాల్పడితే న్యాయస్థానంలో శిక్ష తప్పదు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసుల దర్యాప్తు, న్యాయస్థాన విచారణ కీలక పాత్ర పోషిస్తాయి.”
🏠 Home