🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 04 Oct, 2026 | Page: 1

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డప్పు అశోక్

సంగారెడ్డి అక్టోబర్ 03(స్పందన) తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన డప్పు అశోక్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన డప్పు అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య, ప్రధాన కార్యదర్శి కుమార్, అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎ. రవి భూషణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా తన నియామకానికి సహకరించిన సంగారెడ్డి జిల్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని డప్పు అశోక్ పేర్కొన్నారు.
🏠 Home