🏠 spandanadaily.com
Watermark
Newspaper Logo
spandanadaily.com | Date: 06 Oct, 2026 | Page: 1

ఉత్తమ ఫిలిం మేకర్ అవార్డు అందుకున్న బండారి మైపాల్

మునిపల్లి,అక్టోబర్ 06, ( స్పందన ) మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండారి మహిపాల్‌కు మంగళ వారం నాడు రాష్ట్రస్థాయి ఉత్తమ ఫిలిం మేకర్ అవార్డు లభించింది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆసక్తితో ఈ రంగంలో రాణిస్తున్న మహిపాల్‌ తెలంగాణ ఫోక్‌, వెడ్డింగ్‌, సినీమాటిక్‌ ఫిలిం షూటింగుల్లో తన ప్రతిభను చాటుతున్నారు.
ఉన్నత విద్య పూర్తిచేసుకున్న అనంతరం ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధిని ఎంచుకుని హైదరాబాద్‌లో ఫిలిం మేకర్‌గా కొనసాగుతున్నారు. తనకు ఫోటోగ్రఫీలో తొలి గురువు తన అన్న బండారి పాండు అని మహిపాల్‌ తెలిపారు. తన ప్రతిభను గుర్తించి ఫోటో పరివార్‌ ఇండియా అవార్డు అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లె రవికుమార్‌, మునగాల శైలేందర్‌, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, అభిమన్యరెడ్డి, ఇప్పలపల్లి రమేష్‌ తదితరులు అభినందించారు.
🏠 Home