రేవంత్ పాలనలో కరెంట్ కష్టాలు..
తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి..
సంగారెడ్డి, అక్టోబర్ 12 (స్పందన) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం మళ్లీ చీకట్ల మయంగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ, నిర్లక్ష్య పాలన వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి ఆరోపించారు.నాడు కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌తో కాంతులీనిన పొలాలు.. నేడు రేవంత్ రెడ్డి పాలనలో గంట గంటకూ విధించే విద్యుత్ కోతలతో అంధకారంలోకి నెట్టబడ్డాయన్నారు. విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసి అన్నదాతల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ కు తీరు పై మండి పడ్డారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పగటిపూటే కాకుండా రాత్రింబవళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ అందించి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బిక్షపతి గుర్తుచేశారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం పంటలకు నీళ్లు పారించుకునేందుకు కూడా కరెంట్ దొరకని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం, విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడమే ఈ నాటి కరెంట్ కష్టాలకు ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులను మభ్యపెట్టేందుకు రంగురంగుల హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చాక రైతన్నను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.ఒకవైపు ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, మరోవైపు వేళాపాళా లేని విద్యుత్ కోతల వల్ల బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమయానికి నీరందక పంట దిగుబడులు తగ్గిపోతే అన్నదాతలు కోలుకోలేని దెబ్బ తింటారని హెచ్చరించారు. విద్యుత్ కోతలకు గల అసలు కారణాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని, వెంటనే సరఫరా సమస్యలను పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా మొద్దునిద్ర వీడి వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బిక్షపతి డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని, నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు ఆగి, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఊరుకునేది లేదని, ప్రజలను మమేకం చేస్తూ ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం సాగిస్తామని ఆయన హెచ్చరించారు.