దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించాలి.
హుస్నాబాద్ సెప్టెంబర్ 5 (స్పందన) హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పారదర్శకంగా, చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలని హుస్నాబాద్ ఏసీపీ సౌడారపు సదానందం అధికారులను ఆదేశించారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో డివిజన్ సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రాథమిక ఆధారాలను వెంటనే సేకరించి, గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. రాజీపడదగిన చిన్నపాటి సివిల్, క్రిమినల్ కేసులను గుర్తించి, జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల విచారణను...