సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

వినాయక చవితి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వేడుకల్లో భాగంగా తొలుత రామ్ నగర్‌లోని రామ్ మందిర్ వద్ద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జగ్గారెడ్డి స్వయంగా భజన చేస్తూ భక్తులతో కలిసి వీధుల గుండా ఊరేగింపుగా బ్రాహ్మణవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రతిష్ఠించారు.అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పర్యవేక్షణలో గంజి మైదాన్‌లో ఏర్పాటు చేసిన...