ఇర్ఫానీ దర్గా ఉత్సవాలకు సర్వ సిద్దం
సంగారెడ్డి, సెప్టెంబర్ 19(స్పందన) పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా ఉత్సవాలు అక్టోబర్ 1 వ తేదీ నుండి ప్రారంభమౌతున్నట్లు దర్గా పిఠాధిపతి ఉమర్ బిన్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం దర్గా ఆవరణలో ఉర్సు ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఆవీష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఉర్సు ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు హజరౌతారని, 1 వ తేదీన గంధం ఊరేగింపు,2వ తేదీన దీపారాధన ఉంటుందని, ప్రఖ్యాతి గాంచిన కవులతో కవి సమ్మేళనం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అన్వర్,అహ్మద్,నూమాన్, తదితరులు పాల్గొన్నారు