అట్టహాసంగా నాయిబ్రహ్మణ సంఘం వినాయకుని నిమజ్జనం

సంగారెడ్డి, సెప్టెంబర్ 22(స్పందన) నాయిబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి మంజీరా నగర్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వినాయక మండపం నుండి గణేష్ ఊరేగింపు మొదలు పెట్టి పాత బస్టాండ్ సమీపంలోని మహబూబ్ సాగర్ చేరువులో నిమజ్జనం చేశారు.దారి పొడవునా వినాయక పాటలు గీతాలాపనలు,నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రహ్మణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు యాదయ్య,ప్రధాన కార్యదర్శి సుకుమార్ నాయకులు దత్తు,దుర్గేష్,శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణ అధ్యక్షులు ప్రభు,దత్తాత్రేయ, శ్రీశైలం, రంజోల్ ప్రభు,మురహరి,స్వాగత్ ప్రభు,హనుమంతు నాయకులు పెంటయ్య,ఆంజనేయులు, చరణ్, సురేష్, రాము,వినోద్, అనీల్, సంగమేశ్,సంగమేశ్వర్,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు