మరవెల్లిలో బిక్షపతి స్వామి వినాయక ప్రత్యేక పూజలు
వట్పల్లి, సెప్టెంబర్ 23 (స్పందన) వట్పల్లి మండలంలోని మరవెల్లి గ్రామంలో వీరశైవ లింగాయత్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి స్వామి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరశైవ లింగాయత్ యూత్ సభ్యులు వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.భక్తితో చేసే పూజలు మనసుకు ప్రశాంతతను, సమాజానికి ఐక్యతను అందిస్తాయి. వినాయకుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి” అని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మఠం బిక్షపతి స్వామి మాసన్పల్లి సర్పంచ్ సత్యనారాయణ, డా. వెంకటేశం, సంగమేష్ , కిరణ్, మధు,...