కన్‌సాన్‌పల్లిలో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన

అందోలు, సెప్టెంబర్ 23 (స్పందన ) వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి ‘ఇరుముడి’ సినిమాను ఘనంగా ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ యువ నాయకుడు నోమన్నగారి ధీరజ్‌రెడ్డి ఆధ్వర్యంలో, వినాయక ఉత్సవ కమిటీ సహకారంతో దుర్గా భవాని ఆలయ ప్రాంగణంలోని వినాయక మండపం వద్ద ప్రత్యేకంగా వెండితెరను ఏర్పాటు చేసి సినిమా ప్రదర్శించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత, మహిళలు, పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సినిమాను ఆసక్తిగా వీక్షించారు. “ఆధ్యాత్మికతతో కూడిన మంచి చిత్రాలు యువతలో భక్తిభావంతో పాటు సన్మార్గం పట్ల ఆలోచనను పెంపొందిస్తాయి. పండుగ వేళ గ్రామ ప్రజలందరూ కలిసి ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో...