అన్నదానం మహాదానం.. సేవా కార్యక్రమాలతో యువతకు ఆదర్శం
వట్పల్లి, సెప్టెంబర్ 23 (స్పందన) వట్పల్లి మండలం మరవెల్లి గ్రామంలోని బసవేశ్వర విగ్రహం వద్ద శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా కలాలి లక్ష్మి–మల్లేశం గౌడ్ వ్యవహరించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.“అన్నం పెట్టే చేతులు.. ఆశీర్వాదాలు అందుకునే చేతులుగా మారుతాయి” అనే సందేశానికి అనుగుణంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించి నిర్వాహకులను ఆశీర్వదించారు. భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువత సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ...