జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్..! వెల్డన్ యాదగిరి అంటూ అభినందించిన జిల్లా కలెక్టర్

సంగారెడ్డి,సెప్టెంబర్ 23(స్పందన) వెల్ డన్ యాదగిరి.. గుడ్ జాబ్ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అభినందించారు. నేనే మీకు శాలువా కప్పాలి అంటూ శాలువాతో సత్కరించారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని యాదగిరి కి అందజేశారు.తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ- IJU) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదిన పురస్కరించుకొని మంగళవారం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొనాల్సి ఉన్నది. అత్యవసర పనుల వల్ల ఆయన పాల్గొనలేకపోయారు. దీంతో బుధవారం నాడు జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్ లో...