ఉచిత పథకాలు కాదు.. ఉచిత విద్యను అందించాలి

నవంబర్ 16, 17న ఎఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు – సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దిన్ జహీరాబాద్: పట్టణంలో నిర్వహించిన ఎఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉచిత పథకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో కాషాయీకరణను ప్రోత్సహించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను...