వట్పల్లి దాడి కేసులో ఆరుగురికి జైలు శిక్ష, జరిమానా

వట్పల్లి, సెప్టెంబర్ 28 (స్పందన) వట్పల్లి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళను దూషించి, ఆమె భర్తపై కట్టెలతో దాడి చేసి గాయపరిచిన కేసులో ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కేసు వివరాలు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెప్టెంబర్ 15న ఉదయం 9 గంటల సమయంలో వట్పల్లి గ్రామానికి చెందిన పల్లె సుమిత్రాబాయి తన భర్త కిషన్‌రావు కోసం టిఫిన్ బాక్స్ తీసుకొని వట్పల్లి చౌరస్తాలోని కిరాణా దుకాణం వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాపోళ్ల...