ఘనంగా ఇర్ఫానీ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం
సంగారెడ్డి, అక్టోబర్ 1(స్పందన) సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా 24 ఉర్సు ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దర్గా పిఠాధిపతి ఉమర్ బిన్ అహ్మద్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత జైలు సమీపంలోని జామియా మస్జిద్ నుండి దర్గా వరకు ఒంటెపై గంధం ఊరేగింపు జరగగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం రాత్రి తొమ్మిది గంటల నుండి జాతీయ స్థాయి కవులు, కళాకారులతో కవి సమ్మేళనం నిర్వహించారు.సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఇర్ఫానీ అవార్డును జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనుస్,సంగారెడ్డి వైస్ చైర్మన్ షఫీ లకు అందచేశారు. ఈ...