గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి,అక్టోబర్ 2 (స్పందన) గాంధీ జయంతి సందర్భంగా జాతీయ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో జర్నలిస్టుల...