నీటిని పొదుపుగా వాడండి
రానున్నవి గడ్డు రోజులు నియోజకవర్గ ప్రజలకు జగ్గారెడ్డి సూచన సంగారెడ్డి, అక్టోబర్ 7(స్పందన) సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న ఏడు నెలలు తాగునీటి విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలో నెలకొన్న పరిస్థితులపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాలం చెప్పినట్లు, కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఈసారి సరైన వర్షాలు లేవు. మనం సింగూరు...