రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష

సంగారెడ్డి, అక్టోబర్ 7 (స్పందన) దేశ ప్రజల ఓటు హక్కును, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ బలపడిన రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సహకారంతోనే బీజేపీ మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఈ అంశంపై రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రశ్నలు...