సంగారెడ్డిలో రెండవ రోజుకు చేరిన జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
- రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య,ధర్మపురి సంజయ్ సంఘీభావం సంగారెడ్డి, అక్టోబర్ 8(స్పందన) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, వివిధ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు.భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి జగ్గారెడ్డి దంపతులకు...