సంగారెడ్డి లో రాహుల్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ

గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ సంగారెడ్డి, అక్టోబర్ 12(స్పందన) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ గెస్ట్‌హౌస్ నుంచి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ర్యాలీలో నిర్మలా జగ్గారెడ్డితో పాటు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి’’, ‘‘మోడీ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌక్‌కు చేరుకున్న అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తోందని...