బీజేవైఎం జిల్లా స్పోక్ పర్సన్ గా మేకల ప్రమోద్ కుమార్
బీజేవైఎం సంగారెడ్డి జిల్లా స్పోక్ పర్సన్ గా మేకల ప్రమోద్ కుమార్ నియామకమయ్యారు. సంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ 26 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో జిల్లా స్పోక్ పర్సన్ గా మేకల ప్రమోద్ కుమార్ ను ప్రకటించారు. జిల్లాలో బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కమిటీలో చోటు లభించినందుకు మిత్రులు అభినందించారు.