సదాశివపేట భవానీ మాత ఆలయంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు

ఘనంగా ప్రత్యేక పూజలు.. భక్తులకు మహా అన్నదానం సదాశివపేట,అక్టోబర్ 18 (స్పందన ) అమ్మవారి సేవలోనే ఆత్మతృప్తి.. అన్నదానంలోనే మానవత్వానికి అసలైన ప్రతిరూపం అనే ఆధ్యాత్మిక సందేశంతో సదాశివపేట పట్టణంలోని శ్రీ భవానీ మాత ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా పట్లూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి ఆశీస్సులతో...