Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి, బుదేరా జూనియర్‌ కళాశాలను సందర్శించిన డీఐఈఓ శ్రీనివాస్‌

Author SPANDANA DAILY | 19 Sep 2026, 02:15 PM |
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి,  బుదేరా జూనియర్‌ కళాశాలను సందర్శించిన  డీఐఈఓ శ్రీనివాస్‌

మునిపల్లి, సెప్టెంబరు 19( స్పందన ) సంగారెడ్డి జిల్లా డీఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్వంతోట శ్రీనివాస్‌ తొలిసారిగా శనివారం నాడు బుదేరా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కళాశాలను జిల్లాకు మార్గదర్శకంగా నిలిపేందుకు సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఎల్‌. సుధాకర్‌ను నియమించినట్లు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా డీఐఈఓ శ్రీనివాస్‌ను కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీజీఎల్‌ఏ–711 రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ముద్దం సిద్ధారెడ్డితో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.