Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించాలి.

Author SPANDANA DAILY | 06 Sep 2026, 08:27 PM | TELANGANA
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించాలి.

హుస్నాబాద్ సెప్టెంబర్ 5 (స్పందన) హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పారదర్శకంగా, చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలని హుస్నాబాద్ ఏసీపీ సౌడారపు సదానందం అధికారులను ఆదేశించారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో డివిజన్ సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రాథమిక ఆధారాలను వెంటనే సేకరించి, గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. రాజీపడదగిన చిన్నపాటి సివిల్, క్రిమినల్ కేసులను గుర్తించి, జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం చేకూర్చాలన్నారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించి నిందితులను పట్టుకోవాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచాలని, కోర్టులు జారీ చేసిన ఎన్‌బీడబ్ల్యూలను పెండింగ్‌లో ఉంచకుండా నిందితులను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధితులు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేలా ప్రజాహిత వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ సి ఐ కె.శ్రీధర్, చేర్యాల సి ఐ రమేష్ , ఎస్సైలు లక్ష్మారెడ్డి, అభిలాష్, ప్రశాంత్, అసిఫ్, మహేష్, అపూర్వ పాల్గొన్నారు.