Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మరవెల్లిలో వినాయకుడికి బిక్షపతి స్వామి ప్రత్యేక పూజలు

Author SPANDANA DAILY | 23 Sep 2026, 02:51 PM | Array
మరవెల్లిలో వినాయకుడికి  బిక్షపతి స్వామి   ప్రత్యేక పూజలు

వట్పల్లి, సెప్టెంబర్ 23 (స్పందన) వట్పల్లి మండలంలోని మరవెల్లి గ్రామంలో వీరశైవ లింగాయత్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి స్వామి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరశైవ లింగాయత్ యూత్ సభ్యులు వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.భక్తితో చేసే పూజలు మనసుకు ప్రశాంతతను, సమాజానికి ఐక్యతను అందిస్తాయి. వినాయకుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి” అని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మఠం బిక్షపతి స్వామి మాసన్‌పల్లి సర్పంచ్ సత్యనారాయణ, డా. వెంకటేశం, సంగమేష్ , కిరణ్, మధు, శంకర్ గౌడ్, రాజు, వీరేందర్, నాగరాజు, శేఖర్, శరణం, సి ఎచ్ . నాగరాజు, తుల్జారామ్, బస్వరాజు, మల్లికార్జున్ స్వామి తదితరులను వీరశైవ లింగాయత్ యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. యువత ఐక్యంగా ముందుకు వచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ యూత్ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.