Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం మాజీ ఎంపీటీసీ పాండు

Author SPANDANA DAILY | 25 Sep 2026, 07:11 PM | సంగారెడ్డి
పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం మాజీ ఎంపీటీసీ పాండు

మునిపల్లి,సెప్టెంబరు25, ( స్పందన ) మండల పరిధిలోని పెద్దగోపులారం గ్రామానికి చెందిన బేకరి అంజమ్మకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం మాజీ ఎంపీటీసీ పాండు అందజేశారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఈ చెక్కును లబ్ధిదారుకు అందజేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ సీఎం ఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వారు సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నరేందర్‌చారి, వార్డు సభ్యులు మోహన్, గోపాల్, గ్రామస్తులు నాగేందర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.