Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అర్హులైన మైనార్టీ మహిళలకే కుట్టు మిషన్లు ఇవ్వాలి

Author SPANDANA DAILY | 28 Sep 2026, 06:21 PM | సంగారెడ్డి
అర్హులైన మైనార్టీ మహిళలకే కుట్టు మిషన్లు ఇవ్వాలి

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా తొలి విడతగా 200 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అయితే ఈ పంపిణీలో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. అర్హులైన మహిళలను పక్కనపెట్టి కాంగ్రెస్‌ కార్యకర్తలకు కుట్టు మిషన్లు కేటాయించారని, ఓ కౌన్సిలర్‌ ఇంటికి కూడా మిషన్లు పంపిణీ చేశారని పేర్కొన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని, అర్హులైన ప్రతి మహిళకు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి దృష్టి సారించాలని కోరారు.