Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎస్ఏ–1 జవాబు పత్రాల మూల్యాంకనం

Author Abdul Raheem | 03 Oct 2026, 05:44 PM | సంగారెడ్డి
ఎస్ఏ–1 జవాబు పత్రాల మూల్యాంకనం

మునిపల్లి, అక్టోబర్ 03 ( స్పందన ) తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మునిపల్లి మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో శనివారం 6వ, 9వ తరగతుల ఎస్ఏ–1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. ఇందులో భాగంగా 6వ తరగతి తెలుగు, 9వ తరగతి గణితం సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారు.
మూల్యాంకనంలో విద్యార్థులు సాధించిన మార్కులను పాఠశాలల వారీగా, తరగతుల వారీగా, విద్యార్థుల వారీగా మార్కుల జాబితాల రూపంలో రూపొందించి, మండల విద్యాధికారి కార్యాలయం ద్వారా ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మండల విద్యాధికారి ఎస్‌. భీమ్‌సింగ్‌ పర్యవేక్షణలో అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్లుగా తుకారాం, ప్రశాంత్‌ కుమార్‌, రమణ వ్యవహరించారు. వివిధ పాఠశాలలకు చెందిన తెలుగు, గణితం ఉపాధ్యాయులు సీఈలు, ఏఈలుగా విధులు నిర్వహిస్తూ మూల్యాంకన ప్రక్రియలో పాల్గొన్నారు.