Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఘనంగా ముగిసిన ఇర్ఫాన్ దర్గా ఉర్సు ఉత్సవాలు

Author SPANDANA DAILY | 04 Oct 2026, 10:22 AM | Bhakti, భక్తి
ఘనంగా ముగిసిన ఇర్ఫాన్ దర్గా  ఉర్సు ఉత్సవాలు

సంగారెడ్డి,అక్టోబర్ 3(స్పందన) పట్టణ శివారులోని ఇర్ఫాని దర్గా 24వ వర్షం ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. దర్గాలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు.ఖవ్వాలీ కార్యక్రమం ఆయన దగ్గరుండి ఆధ్యాంతం తిలకించడమే కాకుండా గాయకులకు నజరానా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గాలు,మతాలకు అతీతంగా వస్తారని చెప్పారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు కోన సంతోష్ కుమార్ పాల్గొన్నారు.