Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కంకోల్‌లో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు

Author SPANDANA DAILY | 06 Oct 2026, 05:14 PM | సంగారెడ్డి
కంకోల్‌లో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు

మునిపల్లి, అక్టోబర్‌ 06 ( స్పందన ) మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామంలో మండల మహిళా సమాఖ్య, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్‌ పరీక్షల శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించిన ముందస్తు సర్వేలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన మహిళలకు ఏఐజీ ఆసుపత్రి వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది.
క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఏఐజీ ఆసుపత్రి ద్వారా ఉచిత చికిత్స అందించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మమతా నగేష్‌, ఉపసర్పంచ్‌ అప్సర్‌, మాజీ ఎంపీపీ రామ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సతీష్‌కుమార్‌, ఐకేపీ సిబ్బంది, వైద్య బృందం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.