Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శాంతినికేతన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Author SPANDANA DAILY | 09 Oct 2026, 08:07 AM | Bhakti, భక్తి, సంగారెడ్డి
శాంతినికేతన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వట్పల్లి, అక్టోబర్ 8 (స్పందన) వట్పల్లి మండలంలోని శాంతినికేతన్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఏర్పాటు చేసి, సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బస్వరాజు, మరియు అనిల్,మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, విద్యార్థులకు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.ఈ యొక్క కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు