Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మర్వెల్లి ప్రాథమిక పాఠశాలలో అలరించిన బతుకమ్మ సంబరాలు

Author SPANDANA DAILY | 10 Oct 2026, 07:43 AM | Array
మర్వెల్లి ప్రాథమిక పాఠశాలలో అలరించిన బతుకమ్మ సంబరాలు

వట్పల్లి, అక్టోబర్ 9(స్పందన) మండల పరిధిలోని మర్వెల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు చీరలు,కట్టు బోట్టుతో సాంప్రదాయంగా తయారయి పాఠశాల ఆవరణలో తమ తమ బతుకమ్మలను పేర్చి ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఆధ్వర్యంలో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ ప్రతిక బతుకమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన మిగతా ఉపాధ్యాయులు రిత్విన్ రెడ్డి, సంగయ్య, రవీందర్ , విద్యార్థులు పాల్గొన్నారు.