Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కన్‌సాన్‌పల్లిలో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన

Author SPANDANA DAILY | 23 Sep 2026, 05:30 PM | Bhakti, సంగారెడ్డి
కన్‌సాన్‌పల్లిలో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన

అందోలు, సెప్టెంబర్ 23 (స్పందన ) వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి ‘ఇరుముడి’ సినిమాను ఘనంగా ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ యువ నాయకుడు నోమన్నగారి ధీరజ్‌రెడ్డి ఆధ్వర్యంలో, వినాయక ఉత్సవ కమిటీ సహకారంతో దుర్గా భవాని ఆలయ ప్రాంగణంలోని వినాయక మండపం వద్ద ప్రత్యేకంగా వెండితెరను ఏర్పాటు చేసి సినిమా ప్రదర్శించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత, మహిళలు, పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సినిమాను ఆసక్తిగా వీక్షించారు. “ఆధ్యాత్మికతతో కూడిన మంచి చిత్రాలు యువతలో భక్తిభావంతో పాటు సన్మార్గం పట్ల ఆలోచనను పెంపొందిస్తాయి. పండుగ వేళ గ్రామ ప్రజలందరూ కలిసి ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశాం” అని ధీరజ్‌రెడ్డి తెలిపారు.‘ఇరుముడి’ చిత్రంలోని తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించిన భక్తిరస అంశాలు కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామంలోనే వెండితెరపై సినిమా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.థియేటర్లకు వెళ్లలేని ప్రేక్షకులకు తమ గ్రామంలోనే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి సినిమా చూసే అవకాశం కల్పించినందుకు ధీరజ్‌రెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రదర్శనతో కన్‌సాన్‌పల్లి గ్రామంలో పండుగ సందడి మరింత పెరిగింది.