Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉచిత పథకాలు కాదు.. ఉచిత విద్యను అందించాలి

Author SPANDANA DAILY | 24 Sep 2026, 09:59 PM | సంగారెడ్డి
ఉచిత పథకాలు కాదు.. ఉచిత విద్యను అందించాలి

నవంబర్ 16, 17న ఎఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు
– సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దిన్


జహీరాబాద్: పట్టణంలో నిర్వహించిన ఎఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉచిత పథకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో కాషాయీకరణను ప్రోత్సహించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎఐఎస్ఎఫ్ చేస్తున్న పోరాటాలను ఆయన అభినందించారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం మరింత ఐక్యంగా ఉద్యమించాలని ఎఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విద్య ప్రతి విద్యార్థికి హక్కుగా అందేలా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని సయ్యద్ జలాలుద్దిన్ స్పష్టం చేశారు.అనంతరం నవంబర్ 16, 17 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలోఎఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు ఎఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో CPI జిల్లా సహాయ కార్యదర్శులు ఆనంద్, రెహమాన్,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి, జిల్లా నాయకులు అశోక్, ప్రశాంత్, అజమ్, నర్సింహులు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.