Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శివాజీ మహారాజ్ అందరివాడు - జగ్గారెడ్డి

Author SPANDANA DAILY | 12 Oct 2026, 06:48 AM | Array
శివాజీ మహారాజ్ అందరివాడు - జగ్గారెడ్డి

మహనీయుల చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు

సంగారెడ్డి, అక్టోబర్ 11(స్పందన)చరిత్రని వక్రీకరించి ఛత్రపతి శివాజీ మహరాజ్ ని రాజకీయ లబ్ది కోసం బీజేపీ పార్టీ వాడుకుంటుందని ఇది మంచి పద్దతి కాదని జగ్గారెడ్డి హితవు పలికారు.ఛత్రపతి శివాజీ సంస్థానంలో ఉన్నతాధికారులుగా ముస్లింలు పని చేశారని,ఆయనకు కులం, మతంతో సంబంధం లేదని..ఆయన రాజ్యంలోని ప్రజల బాగోగులు, రాజ్య భద్రతే ముఖ్యంగా పాలించాడన్నారు.సంగారెడ్డి బైపాస్ రోడ్ లో చత్రపతి విగ్రహా ఏర్పాటుకు జరిగిన భూమి పూజ కార్యక్రమం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం, రాజ్య భద్రతకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప ప్రజా నాయకుడు శివాజీ అని పేర్కొన్నారు.శివాజీ చరిత్రను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. శివాజీ పాలనలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారని, దౌలత్ ఖాన్, ముల్లా హైదర్ వంటి ముస్లిం అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేశారని ఆయన తెలిపారు. కులమతాలకు అతీతంగా తన రాజ్యంలోని ప్రజల బాగోగుల కోసం శివాజీ కృషి చేశారని అన్నారు.గొప్ప వీరుడైన శివాజీ ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతతో పాలన సాగించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఒక రాజుగా ముస్లిం పాలకులతో యుద్ధాలు చేశారే తప్ప, ముస్లిం ప్రజలపై దాడులు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు మతపరమైన అర్థాలు ఆపాదించడం సరికాదని అన్నారు.యువత శివాజీ మహారాజ్ చరిత్రను అధ్యయనం చేసి, ఆయన వీరత్వం, పాలనా దక్షత, ప్రజల పట్ల నిబద్ధతను తెలుసుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహనీయుల చరిత్రను వక్రీకరించడం తగదని ఆయన పేర్కొన్నారు.