Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సదాశివపేట భవానీ మాత ఆలయంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు

Author SPANDANA DAILY | 19 Oct 2026, 09:23 AM |
సదాశివపేట భవానీ మాత ఆలయంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు

ఘనంగా ప్రత్యేక పూజలు.. భక్తులకు మహా అన్నదానం

సదాశివపేట,అక్టోబర్ 18 (స్పందన ) అమ్మవారి సేవలోనే ఆత్మతృప్తి.. అన్నదానంలోనే మానవత్వానికి అసలైన ప్రతిరూపం అనే ఆధ్యాత్మిక సందేశంతో సదాశివపేట పట్టణంలోని శ్రీ భవానీ మాత ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా పట్లూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అమ్మవారి ఆశీస్సులతో అన్నదానం

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా యువ నాయకుడు పట్లూరి రాజేష్ మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులు, శ్రీ భవానీ మాత దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ (సదాశివపేట) వారి సంపూర్ణ సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు తమ కుటుంబ సభ్యులతో పాటు సమస్త ప్రజలపై ఉండాలని కోరుకుంటూ భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే మా ఆకాంక్ష”అని రాజేష్ పేర్కొన్నారు.
ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సేవాభావం, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతను చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో పట్లూరి కుటుంబ సభ్యులు, శ్రీ భవానీ మాత దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.